మా భూమిలో సచివాలయం ఎలా నిర్మిస్తారు?

ABN , First Publish Date - 2020-02-12T10:16:31+05:30 IST

తమ పూర్వీకుల కాలం నుంచి తమ ఆధీనంలో ఉన్న భూమిలో సచివాలయాన్ని ఎలా నిర్మిస్తారంటూ పొన్నాం గ్రామస్థులు

మా భూమిలో సచివాలయం ఎలా నిర్మిస్తారు?

 పొన్నాం గ్రామస్థుల ఆందోళన


శ్రీకాకుళం రూరల్‌, ఫిబ్రవరి 11 : తమ పూర్వీకుల కాలం నుంచి తమ ఆధీనంలో ఉన్న భూమిలో సచివాలయాన్ని ఎలా నిర్మిస్తారంటూ  పొన్నాం గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు చదును చేసిన స్థలంలో వారు మంగళవారం ఆందోళన చేశారు. కల్లంగా వినియోగిస్తున్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించి జేసీబీతో చదును చేయించారని,  ఇది స్థానిక అధికార పార్టీ నేతల కుట్ర అని మహిళలు ఆరోపించారు.  గడ్డి కుప్పలను దగ్గరుండి చెరువులోకి తోయించేశారని, మహిళలని చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారులు తమపై ప్రవర్థించిన తీరు దారుణమన్నారు.  ప్రస్తుతం  గ్రామంలో ఒక సచివాలయం ఉందని,  దానికి వంద అడుగులు కూడా దూరంలేని ప్రదేశంలో మరో సచివాలయాన్ని ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.  వేరే చోట నిర్మించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-02-12T10:16:31+05:30 IST