చిరుద్యోగం.. సేవలు కీలకం

ABN , First Publish Date - 2020-12-06T05:21:54+05:30 IST

ఐదున్నర దశాబ్దాల కిందట స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైన హోంగార్డ్స్‌ వ్యవస్థ పోలీసు శాఖకు అనుబంధంగా పని చేస్తోంది. జిల్లాలో పోలీసు శాఖకు చేదోడు వాదోడుగా ఉన్న హోంగార్డ్స్‌ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో హోంగార్డ్స్‌ ప్రశంసనీయమైన విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం హోంగార్డ్‌ డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కఽథనం.

చిరుద్యోగం.. సేవలు కీలకం
పరేడ్‌ నిర్వహిస్తున్న హోంగార్డ్స్‌ (ఫైల్‌)


ట్రాఫిక్‌ నియంత్రణలో కీలక బాధ్యతలు

నేడు హోంగార్డ్స్‌  దినోత్సవం 

ఎచ్చెర్ల, డిసెంబరు 5 : ఐదున్నర దశాబ్దాల కిందట స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైన హోంగార్డ్స్‌ వ్యవస్థ పోలీసు శాఖకు అనుబంధంగా పని చేస్తోంది. జిల్లాలో పోలీసు శాఖకు చేదోడు వాదోడుగా ఉన్న హోంగార్డ్స్‌ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో హోంగార్డ్స్‌ ప్రశంసనీయమైన విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం హోంగార్డ్‌ డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కఽథనం.

జిల్లాలో 742 మంది 

జిల్లాలో 742 మంది హోంగార్డ్స్‌ సేవలందిస్తున్నారు. 630 సాధారణ విధులు నిర్వర్తిస్తుండగా, 112 మంది డిప్యూటేషన్‌పై పనిచే స్తున్నారు. అగ్నిమాపక, అరసవల్లి దేవస్ధానం, రవాణా, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, జాతీయ రహదారుల విభాగం, ఆర్టీసీ,  స్టీల్‌ప్లాంట్‌, జాతీయ రహదారుల విభాగం, మహిళా శిశు సంక్షేమశాఖల్లో డిప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీఐపీ వాహనాలకు డ్రైవర్లగా, బాంబు డిస్పోజల్‌ టీమ్‌ (బీడీ టీమ్‌)లో హోంగార్డ్స్‌ పనిచేస్తున్నారు.  వీరు రోజుకు రూ.710  వేతనం తీసుకుంటున్నారు. ప్రమాద బీమా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇప్పటికి 200 మందికి ఇళ్ల స్థలాలు మంజూరుచేశారు. మిగిలిన వారికి కూ డా ఇళ్ల స్థలాలు అందజేసి, పక్కా ఇళ్లను నిర్మించాల ని కోరుతున్నారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డ్స్‌కు ప్రస్తుతం ఉన్న 10 శాతాన్ని 40 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

 

Updated Date - 2020-12-06T05:21:54+05:30 IST