-
-
Home » Andhra Pradesh » Srikakulam » Homeguard Services Bhoj SP
-
హోంగార్డుల సేవలు భేష్: ఎస్పీ
ABN , First Publish Date - 2020-12-07T05:12:05+05:30 IST
పోలీసు శాఖకు అనుబంధంగా హోంగార్డులు ఎంతో బాగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ అమిత్‌బర్దర్ కొనియాడారు.

ఎచ్చెర్ల, డిసెంబరు 6: పోలీసు శాఖకు అనుబంధంగా హోంగార్డులు ఎంతో బాగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ అమిత్‌బర్దర్ కొనియాడారు. ఎచ్చెర్ల సా యుధ మైదానంలో ఆదివారం హోంగార్డుల అవతరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సివిల్, సాయుధ పోలీసులకు సమాంతరంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 742 మంది హోంగార్డులు ఉండగా, వీరిలో కొంతమంది పలు శాఖల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్నారని తెలిపారు. యూనిఫారంలో ఉన్న ఉద్యోగిని సమాజం పరిశీ లిస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన హోంగార్డులకు జ్ఞాపికలను అందజేశారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు పి.సోమశేఖర్, పి.విఠలేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, డీఎస్పీలు ఎస్‌ఎస్‌ఎస్ శేఖర్, ప్రసాద్, సీఐలు చంద్రశేఖర్, ప్రసాద్, ఆర్‌ఐలు స్వర్ణలత, ప్రదీప్, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.