-
-
Home » Andhra Pradesh » Srikakulam » Home tax collection should be expedited
-
ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T05:58:51+05:30 IST
ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలని పాలకొండ డీఎల్పీవో పి.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం పంచా యతీ కార్యదర్శులతో సమావే శం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు సక్రమంగా అందజేయాలన్నారు.

మెళియాపుటి: ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలని పాలకొండ డీఎల్పీవో పి.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం పంచా యతీ కార్యదర్శులతో సమావే శం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు సక్రమంగా అందజేయాలన్నారు. గ్రామా ల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్ర కుమారి, తహసీల్దార్ బి.ప్రసాదరావు, ఈవోపీఆర్డీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలు చేరుకోవాలి
రేగిడి: పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు లక్ష్యాలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈవోపీఆర్డీ ఎ.ప్రభాకరరావు అన్నారు. ఎంపీ డీవో కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులు, అసిస్టెంట్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో రూ.47 లక్షలు వసూలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా మందకొడిగా ఉండడంపై సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు.
బకాయిలు చెల్లించండి
హిరమండలం: మేజర్ పంచాయతీలో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలను తక్షణమే చెల్లించాలని ఈవో అప్పలరాజు అన్నారు. మంగళ వారం పంచాయతీ సింబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.2.81 లక్షలు మాత్రమే వసూలైందని, మిగిలిన బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.