అర్హత లేని వారికి ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2020-12-30T06:02:09+05:30 IST

ధనవంతులు, మేడలన్నవారు, అర్హత లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం ఆరోపించారు.

అర్హత లేని వారికి ఇళ్ల స్థలాలు
మాట్లాడుతున్న కణితి విశ్వనాథం

బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు విశ్వనాథం

పలాస: ధనవంతులు, మేడలన్నవారు, అర్హత లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాఽథం ఆరోపించారు. మంగళవారం పలాసలో విలేకరులతో మాట్లా డుతూ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అనుమతిచ్చినా రాష్ట్రప్రభుత్వం నిర్మాణం చేపట్టలేదన్నారు. తితలీ తుఫాన్‌లో టెక్కలి డివిజన్‌లో 10 వేల ఇళ్లు కూలి పోయినా, వారికి  నేటికీ ఇళ్లు నిర్మిం చి ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుతం ఇస్తు న్న పట్టాల జాబితాలో కూడా వారి పేర్లు లేవని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు పి.వైకుంఠరావు, కొర్రాయి బాలకృష్ణ యాదవ్‌, ఎండుదొర పాల్గొన్నారు.   

 

Updated Date - 2020-12-30T06:02:09+05:30 IST