-
-
Home » Andhra Pradesh » Srikakulam » Home needs making stop
-
ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేటల్లో ఫర్నీచర్ తయారీ కేంద్రాలు మూసివేత
ABN , First Publish Date - 2020-11-28T04:48:01+05:30 IST
ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేటలలో ఫర్నీచర్ తయారీ కేంద్రాలను మూసి వేయించినట్టు కృష్ణాదేవిపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.వెంకటరమణ శుక్రవారం తెలిపారు.

కృష్ణాదేవిపేట, నవంబరు 27 : ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేటలలో ఫర్నీచర్ తయారీ కేంద్రాలను మూసి వేయించినట్టు కృష్ణాదేవిపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.వెంకటరమణ శుక్రవారం తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఏఎల్‌పురం మీదుగా బాలారం నుంచి బొలేరో వాహనంలో అక్రమంగా నాలుగు మంచాలను తరలిస్తుండగా, నర్సీపట్నం డీఎప్‌వో వినోద్‌కుమార్ పట్టుకున్నట్టు చెప్పారు. అటవీ అధికారుల అనుమతులు లేకుండా ఫర్నీచర్ తయారీతో పాటు అక్రమంగా తరలించడం నేరంగా పరిగణిస్తూ ఫర్నీచర్ తయారీ కేంద్రాల్లో పనులు నిలుపుదల చేయించారు. దీంతో కొంతమంది కార్పెంటర్లు చేసిన తప్పులకు ఈ గ్రామాల్లో అందరు కార్పెంటర్లు ఇబ్బందుల్లో పడ్డారు.