చిన్నారులకు ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2020-11-04T05:27:38+05:30 IST
మండలంలోని హరిపురంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాఽథలుగా మారిన దుర్గాబెహరా, దీప్తి బెహరాలకు బుడ్డెపుపేట గ్రామానికి చెందిన తిప్పన దుర్యోధనరెడ్డి, నీలవేణి దంపతులు అండగా నిలిచారు.
ఇచ్ఛాపురం రూరల్ : మండలంలోని హరిపురంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాఽథలుగా మారిన దుర్గాబెహరా, దీప్తి బెహరాలకు బుడ్డెపుపేట గ్రామానికి చెందిన తిప్పన దుర్యోధనరెడ్డి, నీలవేణి దంపతులు అండగా నిలిచారు. తల్లిదండ్రులు కోల్పోయి అనాఽథలుగా మారిన దుర్గా బెహరా, దీప్తి బెహరాపై అక్టోబరు 29న ఆంధ్రజ్యోతిలో ‘తల్లిదండ్రులు కోల్పోయి..అనాథలుగా మారి’ కథనం ప్రచురితమైంది. ఈ మేరకు బాధితులకు మంగళవారం రూ.2000, 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.