వడగళ్ల వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2020-03-23T09:34:13+05:30 IST

ఉద్దానంలోని పలుచోట్ల ఆదివారం వడగళ్ల వర్షం బీభ త్సం సృష్టించింది.ఉదయం నుంచి ఎండ తీవ్రంగా

వడగళ్ల వర్ష బీభత్సం

ఇచ్ఛాపురం రూరల్‌, మార్చి 22 : ఉద్దానంలోని పలుచోట్ల ఆదివారం వడగళ్ల వర్షం బీభ త్సం సృష్టించింది.ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉంది. అయితే జనతా కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో ఆ ప్రభావం జనజీవనంపై పెద్దగా ప్రభావం చూపలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇచ్ఛాపురం మండలంలోని కేశుపురం, ఈదుపురం, లొద్దపుట్టి, ఇనేసుపేట తదితర గ్రామాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే జనత కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఎటువంటిఇబ్బందులకు గురికాలేదు.


భామిని: బాలేరు, సొలికిరి, తాలాడ, ఘనసర తదితర గ్రామాల్లో ఆదివారం ఈదురుగాలులతోపాటు వడగండ్లు వర్షం కురిసింది.  

Updated Date - 2020-03-23T09:34:13+05:30 IST