‘అల్లూరి’కి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-07-05T11:53:47+05:30 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సారవకోట, నందిగాం,

‘అల్లూరి’కి ఘన నివాళి

సారవకోట/నందిగాం/ఎల్‌ఎన్‌పేట, జూలై 4:  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సారవకోట, నందిగాం, ఎల్‌ఎన్‌పేటల్లో అల్లూరి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సారవకోట ఆదివాసీ జిల్లా జేఏసీ ప్రతినిధి వాబ యోగేశ్వరరావు ఆధ్వర్యంలో  మాజీ ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, అధికారులు మాట్లాడుతూ.. గిరిజనుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు అల్లూరి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.  కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నందిగాంలో  బెజ్జిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంపీ డీవో రాజేశ్వరరావు, ఎల్‌ఎన్‌పేటలో ఎంపీడీవో మండల ప్రత్యేకాధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T11:53:47+05:30 IST