నువాగడలో గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయండి
ABN , First Publish Date - 2020-11-04T05:02:55+05:30 IST
నువాగడ పంచాయతీ పరిధిలో గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కొండప్రాంతాన్ని పార్టీ నాయకులు పరిశీలించారు.
కంచిలి:నువాగడ పంచాయతీ పరిధిలో గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కొండప్రాంతాన్ని పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కొండలో అక్రమంగా తవ్వకాలు జరపాలని యత్నిస్తుండడంపై అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే గిరిజనులు, రైతులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా బాధ్యుడు నారాయణస్వామి, మండల కార్యదర్శి జి.తరిణి, వసంతరావు,ఎ.లోకనాథం, జోగేష్ పాల్గొన్నారు.