రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-12-02T05:21:08+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌లు విమర్శించారు. వ్యవసాయ బిల్లులు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళ వారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి


 డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి

గుజరాతీపేట:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌లు విమర్శించారు. వ్యవసాయ బిల్లులు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళ వారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సత్యవతి జెండా ఊపి ప్రారం భించారు. సంతోషిమాత గుడి నుంచి కలెక్టరేట్‌ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ, పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ చట్టాను ఉపసంహరించుకోవాలని, లేదంటే రైతులకు మద్దతుగా మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద బుధవారం నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు డీఎస్‌కే ప్రసాద్‌, సనపల అన్నాజీరావు, డి.గోవిందమల్లిబాబు, చింతాడ దిలీప్‌, అంబటి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-02T05:21:08+05:30 IST