రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-07T05:08:43+05:30 IST

రాజ్యాంగ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం


టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ 

ఆమదాలవలస: రాజ్యాంగ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. ఆదివారం పట్టణంలోని రైతుబజారు సమీపంలో అంబేడ్కర్‌ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన  రాష్ట్రంలో  రాజారెడ్డి రాజ్యాంగాన్ని  ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. శాసనసభలో రాజ్యాంగస్ఫూర్తితో మెలగాల్సిన స్పీకర్‌ వైసీపీ ఏజెంట్‌గా వ్యవహరించారని దుయ్యపట్టారు. ప్రతిపక్ష నాయకుడిపై స్పీకర్‌ అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా ప్రజాసమస్యలపై చర్చించేందుకు అవకాశం లేకుండా మైక్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. రాజ్యాంగప్రతులపై ప్రమాణం చేసిన స్పీకర్‌, మంత్రులు వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, ఆపార్టీ నాయకులు నూకరాజు ఎ.భాస్కరరావు పాల్గొన్నారు. 


Read more