దేవాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-24T10:20:10+05:30 IST

దేవాలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు.

దేవాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

పాతపట్నం, సెప్టెంబరు 23: దేవాలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, వాటిని పరిరక్షించాలని కోరుతూ బుధవారం నీలమణి దుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. తక్షణం ఈ సంఘటనలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పైల లక్ష్మయ్య, శివాల చిన్నయ్య, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T10:20:10+05:30 IST