ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-12-21T04:58:02+05:30 IST
షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ పేడాడ ప్రభాకరరావు విమర్శించారు.

ఫ్యాప్టో చైర్మన్ ప్రభాకరరావు
గుజరాతీపేట: షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ పేడాడ ప్రభాకరరావు విమర్శించారు. ఆది వారం స్థానిక ఎస్‌టీయూ కార్యాల యంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదిన్నరగా ఊరించి ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ ప్రకటిం చిన ప్రభుత్వం ఇప్పుడు సర్వర్లు పని చేయడం లేదని చెప్పడం తగదన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పరిశీలన, వెబ్‌ఆప్షన్లు అంటూ గత నెలరోజులుగా ఉపాధ్యాయులను నరకయాతనకు గురి చేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మళ్లీ ఎంఈవో లాగిన్‌లో బదిలీలకు ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రీషెడ్యూలు ప్రకటించడం ప్రభుత్వం చేతకాని తనమన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని ఉపాధ్యాయులు ఉద్యమం చేపడుతున్నా స్పందించడం లేదన్నారు. ఉపాధ్యాయ బదిలీలను వ్యాపారంగా మార్చిన ఘనత ప్రభుత్వానికే దక్కిం దని ఆయన దుయ్యబట్టారు.
మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పప్పల రాజశేఖర్‌రావు, బత్తుల రవికుమార్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భైరి అప్పారావు, గద్దేం నారాయణరావులను ఆదివారం విజయవాడలో కలిసి వినతిప త్రం అందజేశారు. నాడు-నేడు పనులు పర్యవేక్షిస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయు లకు ఎర్నడ్ లీవ్(ఈఎల్) ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.