-
-
Home » Andhra Pradesh » Srikakulam » gouthu lachchanna is national figure
-
గౌతు లచ్చన్న ఆశయాలకు అందరం వారసులమే
ABN , First Publish Date - 2020-12-29T04:56:09+05:30 IST
సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలకు అందరం వారసులమేనని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సోమవారం కాశీబుగ్గలో శ్రీశయన సంఘ నేతలతో కలిసి విలేఖర్ల సమావే శంలో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం లచ్చన్న స్థాయి తగ్గించ వద్దని..ఆయన జాతి వ్యక్తి కాదని...

నా వ్యాఖ్యలను వక్రీకరించారు
మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
కాశీబుగ్గ, డిసెంబరు 28: సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలకు అందరం వారసులమేనని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సోమవారం కాశీబుగ్గలో శ్రీశయన సంఘ నేతలతో కలిసి విలేఖర్ల సమావే శంలో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం లచ్చన్న స్థాయి తగ్గించ వద్దని..ఆయన జాతి వ్యక్తి కాదని...జాతీయ వ్యక్తిగా అభివర్ణించారు. ఇటీవల గౌతు లచ్చన్న విగ్రహంపై తానుచేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. జంట పట్టణాల్లో భూ ఆక్రమణలపై ప్రారంభమైన చర్చ లచ్చన్న విగ్రహం వైపు వెళ్లడం దురదృష్టకరమన్నారు. తాను లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని అనలేదన్నారు. దేవదాయ శాఖ భూముల్లో విగ్రహం ఉందని..ఆక్రమణలు తొలగిస్తే అక్కడి నుంచే ప్రారంభిస్తామన్న మాటను వక్రీకరించారని.. అది వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నట్టు తెలిపారు. శ్రీశయన సంఘ జాతీయ అధ్య క్షుడు వంగ మహేష్, రాష్ట్ర అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి చీపురు కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు మండల మన్మఽథరావు లచ్చన్న విగ్రహ స్థలం పరిశీలించారని చెప్పారు.విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని దేవదాయశాఖ నుంచి క్రమబద్దీకరించి, స్మారకవనంగా మార్చేందుకు కృషి చేయాలని కోరినట్లు చెప్పారు. అందుకు తనవంతు సహకారమందిస్తానన్నారు. ఈ విషయంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ శిరీష, మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో శ్రీశయన సంఘ ప్రతినిధులు డి.రాంబాబు, లాల్‌బహుదూర్ శాస్త్రి, ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్ పాల్గొన్నారు.