-
-
Home » Andhra Pradesh » Srikakulam » gooden as badminton association patron
-
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్యాట్రన్‌గా ‘గూడేన’
ABN , First Publish Date - 2020-12-15T06:19:04+05:30 IST
జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్యాట్రన్‌గా డాక్టర్ గూడేన సోమేశ్వరరావు నియమితుల య్యారు. సోమవారం నగరంలో అసోసియేషన్ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు.

గుజరాతీపేట : జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్యాట్రన్‌గా డాక్టర్ గూడేన సోమేశ్వరరావు నియమితుల య్యారు. సోమవారం నగరంలో అసోసియేషన్ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. అసోసియేషన్ లోకి కొత్తగా ఏడుగురిని తీసుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్ తెలిపారు. సీఈవోగా సంపతరావు సూరిబాబు, కార్యనిర్వాహక కార్యదర్శిగా అశోక్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నక్క రామకృష్ణ, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెం ట్‌గా ఎ.వేణుగోపాలరావు, ఎగ్జిక్యూటీవ్ జాయింట్ సెక్రటరీగా పలాసకు చెందిన పల్లా రమేష్, సభ్యులుగా సైలేష్‌కుమార్, సునీల్‌కుమార్ నియమితులయ్యారు. కార్యక్రమంలో సైలాని, రత్నాజీ, గురుగుబెల్లి ప్రసాద్, మాధురి పాల్గొన్నారు.