ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన బోధన

ABN , First Publish Date - 2020-11-06T10:09:51+05:30 IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెరుగైన బోధన సాధ్యమని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని వృత్తి విద్యా కళాశాలలో వర్చువల్‌ స్టూడియోను ఆయన గురువారం ప్రారంభించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన బోధన

గుంటూరు(విద్య), నవంబరు 5: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెరుగైన బోధన సాధ్యమని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని వృత్తి విద్యా కళాశాలలో వర్చువల్‌ స్టూడియోను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్టూడియో ద్వారా నిష్ణాతులైన అధ్యాపకులు బోధనలను  విద్యార్థులు నేరుగా వినే సౌలభ్యం కలుగుతుందన్నారు.కొవిడ్‌ నేపథ్యంలో వర్చువల్‌ స్టూడియోలను విద్యార్థులు సమర్ధంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు ఆర్‌జేడీ పద్మ, ఆర్‌ఐవో జడ్‌ఎస్‌ రామచంద్రరావు, డీవీఈవో కృష్ణారెడ్డి, ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆనందబాబు, ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత, వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ కో ఆర్డినేటర్‌  ఆచార్య యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T10:09:51+05:30 IST