ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

ABN , First Publish Date - 2020-12-11T05:16:22+05:30 IST

ఎం.తోటూరులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో గురువారం నియోజకవర్గ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు దక్కత కృష్ణమూర్తిరెడ్డి అధ్యక్షతన మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు.

ఘనంగా మానవ హక్కుల దినోత్సవం
ఇచ్ఛాపురం: విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఎంపీడీవో వెంకటరమణ


 ఇచ్ఛాపురం: ఎం.తోటూరులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో గురువారం నియోజకవర్గ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు దక్కత కృష్ణమూర్తిరెడ్డి అధ్యక్షతన మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సంద ర్భంగా  తహసీల్దార్‌ మురళీమోహన్‌రావు, ఎంపీడీవో వెంకటరమణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాల్లో మానవ హక్కుల దినోత్సవం ఒకటని తెలిపారు.అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.  కార్యక్రమంలో సంఘ సెక్రటరీ ఎం.రాంబాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.రా మారావు, కోశాధికారి ఎస్‌.ప్రేంకుమార్‌ పాల్గొన్నారు. 

భామిని: రాజ్యాంగంలో పొందు పరిచిన పౌరహక్కులను  వినియోగించుకోవచ్చని తహసీ ల్దార్‌ నర్సింహమూర్తి తెలిపారు. గురువారం భామినిలో   మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మానవ హక్కుల సంస్థ సభ్యులు పౌరహక్కులపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో పౌరహక్కుల సభ్యులు మన్మఽథరావు, ఆరిక శివ పాల్గొన్నారు.

ఆమదాలవలస:రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ తక్షణమే ఏర్పాటుచేయాలని ఏపీసీఎల్‌ఏ  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు డిమాండ్‌చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మానవహక్కుల దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్‌ ఏర్పాటుతోపాటు వాటిలో ఉన్న ఖాళీలను భర్తీచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై మండిపడ్డారు.  

 

Updated Date - 2020-12-11T05:16:22+05:30 IST