ఎకరాకు రూ.35 వేలివ్వాలి

ABN , First Publish Date - 2020-12-30T05:56:52+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహరం కింద ఎకరాకు రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10వేలు ప్రకటించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరా జప్ప ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎకరాకు రూ.35 వేలివ్వాలి
సామర్లకోటలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

  • పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 
  • ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు

సామర్లకోట, డిసెంబరు 29: నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహరం కింద ఎకరాకు రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10వేలు ప్రకటించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరా జప్ప ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడీపీ పిలుపుతో సామర్లకోట తహశీ ల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో  ధర్నా నిర్వహించారు. తెలుగు రైతు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరా జప్ప ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రైతు బాంధవుడిగా ఆ పార్టీ నాయ కులు, మంత్రులతోనూ కీర్తిస్తున్న సీఎం జగనకు క్షేత్రస్థాయిలో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టాక 19 నెలల్లో 276మంది రైతులు చనిపోయారన్నారు. తుఫానలు సంభవించిన మూడునెలల్లో పంటలు నష్టపోతే అరకొరగా నష్టం నమోదులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు. రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడంతో రైతు మరింత అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాడన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని లేకుంటే రైతులందర్నీ సమీకరించి ఉద్యమిస్తామని ఎమ్మెల్యే చినరాజప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ ఆర్‌.శ్రీనివాస్‌కు చినరాజప్ప వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాలకుర్తి శ్రీనుబాబు, రాజా సూరిబాబురాజు, అడబాల కుమారస్వామి, తోటకూర శ్రీనివాస్‌, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్‌, కంటే జగదీష్‌మోహన్‌, డాక్టర్‌ గొరకపూడి చిన్నయ్యదొర పాల్గొన్నారు.


  • రైతుల నిరసన ర్యాలీ..


పంట నష్టం నమోదులో నష్టపోయిన రైతులందర్నీ ప్రభుత్వం ఆదుకోవాలని సామర్లకోట మండల, పట్టణ పరిధిలో రైతులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే చినరాజప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజాసూరి బాబురాజు, పాలకుర్తి శ్రీనుబాబు పాల్గొన్నారు. ర్యాలీ మెహెర్‌ కాంప్లెక్సు నుంచి మఠం సెంటర్‌, స్టేషన్‌ సెంటర్‌, గాంధీ బొమ్మ సెంటర్‌, మున్సిపల్‌ కార్యాలయం మీదుగా తహశీల్దార్‌ కార్యాలయం వరకూ కొనసాగింది.

 

Updated Date - 2020-12-30T05:56:52+05:30 IST