మెరుగైన వైద్యసేవలందించండి

ABN , First Publish Date - 2020-12-31T05:28:10+05:30 IST

పేదలకు అందు బాటులో వైద్యసేవలను అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. కంబకాయి రోడ్డులోని నూతనంగా ప్రారంభించిన నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు.

మెరుగైన వైద్యసేవలందించండి
వైద్యులతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

నరసన్నపేట, డిసెంబరు 30: పేదలకు అందు బాటులో వైద్యసేవలను అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. కంబకాయి రోడ్డులోని నూతనంగా ప్రారంభించిన నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. పట్టణంలో  ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నా రు. మానవతా దృక్పథంతో మంచి సేవలను అందిం చాలని వైద్యుడు పొన్నాడ గణేష్‌కు సూచించారు.  కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి, నాయకులు బలగ నాగేశ్వరరావు, గొద్దు చిట్టిబాబు, ఆసుపత్రి ఎండీ కోర్ను మోహన్‌లక్ష్మి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-31T05:28:10+05:30 IST