-
-
Home » Andhra Pradesh » Srikakulam » From a single panchayat
-
పోటీ రసవత్తరం
ABN , First Publish Date - 2020-03-13T10:53:19+05:30 IST
మందస జడ్పీటీసీ స్థానాన్ని రెండోసారి కూడా ఎస్టీ మహిళకు కేటాయించడం బంధువుల మధ్య పోటీకి తావిచ్చింది.

మందస జడ్పీటీసీ కోసం బంధువుల మధ్య పోటీ
ఒకే పంచాయతీ నుంచి బరిలోకి
హరిపురం, మార్చి 12: మందస జడ్పీటీసీ స్థానాన్ని రెండోసారి కూడా ఎస్టీ మహిళకు కేటాయించడం బంధువుల మధ్య పోటీకి తావిచ్చింది. ఒకే పంచాయతీ నుంచి మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా వరుసకు బంధువులు కావడంతో పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి తాజా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సవర కుమారి రెండోసారి పోటీలో నిలవగా.. వైసీపీ నుంచి కొండలోగాం తాజా మాజీ సర్పంచ్ సవర చంద్రమ్మ, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సవర పద్మ బరిలో నిలిచారు. దీంతో వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన కుమారి, చంద్రమ్మ, పద్మల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. మందస మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు పది వరకు ఎస్టీ పంచాయతీలు ఉన్నా ప్రధాన పార్టీలన్నీ కొండలోగాం నుంచే అభ్యర్థులను బరిలోకి దింపటంతో అందరి దృష్టి దీనిపై పడింది.