ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-07-18T10:22:44+05:30 IST

పాలానా సౌలభ్యం పరంగా ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్‌ చేశారు.

ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే కొనసాగించాలి

మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ


 గుజరాతీపేట: పాలానా సౌలభ్యం పరంగా ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ  నియోజకవర్గాలను వేరే జిల్లాల్లో కలిపితే శ్రీకాకుళం జిల్లా 80 ఏళ్ల వెనక్కి వెళ్లిపోతుందని స్థానిక వైసీపీ సీనియర్‌ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సబబేనని  అన్నారు. ప్రతిపక్ష పార్టీగా తాము కూడా ఇదే కోరుకుంటు న్నామన్నారు. టీడీపీ హయాంలో ఇప్పటికే ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంజనీరింగ్‌ కళాశాలలతో పాటు అంబేడ్కర్‌ వర్సిటీ, పారిశ్రామిక వాడలు, ఇలా ఎన్నో ఉన్నాయన్నారు.


ఇప్పుడు ఈ ప్రాంతాలను వేరే జిల్లాల్లో కలిపితే హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడదీసిన మాదిరిగా శ్రీకాకుళం  పరిస్థితి  మారుతుందన్నారు.   పాలనా పరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయన్నారు. దీనిపై  తమ అధినేత చంద్రబాబుకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. జిల్లా వాసులకు అన్యాయం జరగకుండా విభజన ప్రక్రియ చేపట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు.


 ధర్మాన మాటలను స్వాగతించాలి

జిల్లా విభజనపై ప్రజల మనోగతాన్నే ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యక్తపరిచారని, ఆయన మాటలను స్వాగ తించాలని జిల్లా మత్స్యర సంఘం నాయకుడు కోనాడ నర్సింగరావు  కోరారు. శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నర్సింగ రావు మాట్లాడారు.  ధర్మాన మాటలను కొంతమంది అదే పనిగా తప్పు పట్టడం సరికాదన్నారు. ధర్మానకు మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఐదు వంతెనలు, ట్రిపుల్‌ ఐటీ, రిమ్స్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు మైలపల్లి లక్షుం, వారధి లక్ష్మణరావు, వాకపిల్లి పొట్టివాడు, సూర్యం, జోగారావు తదితరులు పాల్గొన్నారు.


 ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి 

ఎచ్చెర్ల: జిల్లాల పునర్విభజనలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి(బాబ్జి) సూచించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకొని ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని విజయన గరం జిల్లాలో విలీనం చేస్తామ నడం సమంజసం కాదన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎచ్చెర్ల గుండెకాయ వంటి దని, విద్యాసం స్థలు, పారిశ్రామికవాడలో ఇక్కడే ఉన్నాయని చెప్పారు.  ప్రజల అభిప్రాయం మేరకే అధ్యయన కమిటీ నిర్ణయం తీసుకోవాల న్నారు. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని తెలిపారు.  

Updated Date - 2020-07-18T10:22:44+05:30 IST