మొండి బకాయిలు చెల్లించకుంటే స్థలాల జప్తు
ABN , First Publish Date - 2020-07-19T12:06:35+05:30 IST
పరిశ్రమల నిర్వాహ కులు విద్యుత్ శాఖకు బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే పరిశ్రమలకు సంబంధించిన స్థలాలను జప్తు

ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేష్
రాజాం, జూలై 18: పరిశ్రమల నిర్వాహ కులు విద్యుత్ శాఖకు బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే పరిశ్రమలకు సంబంధించిన స్థలాలను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ నెల్లి రమేష్ పే ర్కొన్నారు. శనివారం రాజాం సబ్ డివిజన్ పరిధి లోని ఐదు మండలాల్లో హెచ్‌టీ ఇండస్ట్రీస్ మొం డి బకాయల వసూలుకు సంబంధించిన సంస్థల స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బకాయిలపై ఇప్పటికే అనేక పర్యాయాలు జప్తు నోటీసులిచ్చినా యాజమాన్యాలు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయనతో పాటు జిల్లా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పి.తాతా చార్యులు, రాజాం సబ్ డివిజనల్ డీఈఈ బీవీ రమణ, డిప్యూటీ తహసీల్దార్ పి.గణేష్, ఐదు మండలాల ఏఈలు ఉన్నారు.