కొందరికే.. అను‘గృహం’

ABN , First Publish Date - 2020-12-08T04:48:32+05:30 IST

పట్టణాల్లో పేదలకు గృహాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ద్వారా కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా, ఇంతవరకూ లబ్ధిదారులకు కేటాయించలేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పట్టణ పేదల కోసం రూపాయికే ఇళ్లు అందిస్తామని చెబుతోంది. 300 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంటిని లబ్ధిదారులు వాటాగా రూపాయి చెల్లిస్తే చాలని స్పష్టం చేసింది. దీంతో పట్టణాల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు 1,968 మందిని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. మరోవైపు గతంలో రద్దయిన ఇళ్ల స్థానంలో స్థలాల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. అర్హులు చాలామంది ఉన్నా.. కొంతమందికే లబ్ధి దక్కనుందని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు.

కొందరికే.. అను‘గృహం’
పాత్రునివలసలో నిర్మించిన టిడ్కో ఇళ్లు


 టిడ్కో గృహాలపై లబ్ధిదారుల ఆశలు

 వేలలో దరఖాస్తులు.. 

 1,968 మందికే ‘రూపాయి’ ఇళ్లు.. 

రద్దయిన ఇళ్ల స్థానంలో స్థలాలు!

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

పట్టణాల్లో పేదలకు గృహాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ద్వారా కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా, ఇంతవరకూ లబ్ధిదారులకు కేటాయించలేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పట్టణ పేదల కోసం రూపాయికే ఇళ్లు అందిస్తామని చెబుతోంది. 300 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంటిని లబ్ధిదారులు వాటాగా రూపాయి చెల్లిస్తే చాలని స్పష్టం చేసింది. దీంతో పట్టణాల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు 1,968 మందిని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. మరోవైపు గతంలో రద్దయిన ఇళ్ల స్థానంలో స్థలాల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. అర్హులు చాలామంది ఉన్నా.. కొంతమందికే లబ్ధి దక్కనుందని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు.

----------------------

టిడ్కో ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. అర్హులకు గృహాలు మంజూరు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పట్టణ పేదలకు సొంతిళ్లు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం.. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ(టిడ్కో) ద్వారా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, రాజాం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాల్లో మొత్తం పదివేల గృహాలు నిర్మించడానికి  అధికారులు ప్రతిపాదించారు. గృహ నిర్మాణాల కోసం మొత్తం మూడు కేటగిరిల్లో  రూ.500, రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల నుంచి చెక్కుల రూపంలో నగదును సేకరించారు. ఈ క్రమంలో 8,800 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 3,872 గృహాలు పనులు సుమారు 70శాతానికిపైగా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న దశలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ హయాంలో ప్రారంభించి.. 25 శాతం కంటే తక్కువ పనులు చేపట్టిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసేసింది. ఇందులో భాగంగా 4,928 ఇళ్లు రద్దయ్యాయి. దీంతో టిడ్కో ఇళ్లపై ఆశలు పెట్టుకున్న చాలామంది నిరాశ చెందారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి ఇళ్ల మంజూరుకు చర్యలు చేపడుతోంది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో మళ్లీ ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండడం.. ప్రభుత్వం నుంచి వివిధ రాయితీలు లభిస్తుండడంతో మళ్లీ పట్టణ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 


జిల్లాలో ఇదీ పరిస్థితి : 

జిల్లాలో ప్రస్తుతం 3,872 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. శ్రీకాకుళం (పాత్రునివలస)లో 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఆమదాలవలస, పలాస, రాజాంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చేపడుతున్న ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది. ప్రస్తుతం శ్లాబ్‌ దశకు వచ్చింది. మిగిలిన అన్ని పట్టణాల్లో 60-70 శాతం పనులు పూర్తయినట్లు టిడ్కో అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎనిమిది నెలల్లోనే పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 300(మొదటి కేటగిరీ), 365(రెండో కేటగిరీ), 430(మూడో కేటగిరీ) చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మించి అందజేయనున్నారు. 300 చదరపు అడుగుల ఇంటి విలువ రూ.6.65 లక్షలు కాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సబ్సిడీపై మంజూరు చేయనున్నాయి. లబ్ధిదారుడి వాటా కింద రూపాయి చెల్లిస్తే చాలు. అలాగే 365 చదరపు అడుగులకు సంబంధించి లబ్ధిదారుడి వాటా 25 వేలు చెల్లించాలి. బ్యాంకు రుణం 3.05 వరకు వర్తిస్తుంది. 430 చదరపు అడుగులకు సంబంధించి లబ్ధిదారుడి వాటా రూ.50వేలు చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.80 లక్షలు లభిస్తుంది. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4.35 లక్షలు సబ్సిడీ ఇవ్వనున్నాయి. మొదటి కేటగిరీ కింద 1,968 మందికి మాత్రమే ఉచితంగా ఇళ్లు అందనున్నాయి. రెండో కేటగిరి కింద 864 మందికి, మూడో కేటగిరీ కింద 1040 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అధికారులు  టిడ్కో లబ్ధిదారులందరికీ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. బ్యాంకు లింకేజీ అవసరమైన వారికి మెప్మా సిబ్బందితో సహకారాన్ని అందించేలా చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకుల డాక్యుమెంటేషన్‌  ప్రక్రియ జరుగుతోంది. అలాగే రద్దయిన 4,928 ఇళ్ల స్థానంలో లబ్ధిదారులకు స్థలాలను అందజేసేలా ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు చెల్లించిన డీడీలను కూడా వెనక్కి ఇచ్చేయనుంది. 


చురుగ్గా పనులు

రివర్స్‌ టెండరింగ్‌ పేరిట గుర్తించిన ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు సంబంధించి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కాలువలు, సీసీ రహదారులు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యానికి సంబంధించి పనులు చేపడుతున్నాం.

-డి.వెంకటరమణమూర్తి, టిడ్కో ఈఈ  


లబ్ధి ఇలా..

--------------------------------------------------------------------------------- 

చదరపు విలువ సబ్సిడీ (రూ.లక్షల్లో) లబ్ధిదారుని బ్యాంకు రుణం

అడుగులు రూ.లక్షల్లో కేంద్రం     రాష్ట్రం వాటా(రూ.) (రూ. లక్షల్లో)

-------------------------------------------------------------------------------------------- 

సింగిల్‌ 300 రూ. 6.65 1.50 5.15     1         -------

సింగిల్‌ 365 రూ. 7.65 1.50 2.85 25,000 3.05

డబుల్‌ 430 రూ. 8.65 1.50 2.85 50,000 3.80

----------------------------------------------------------------------- జిల్లాలో టిడ్కో  ఇళ్ల పరిస్థితి ఇదీ....

--------------------------------------------------------------------------------- 

పట్నం        మంజూరు     చదరపు అడుగులు

                300 365 430

--------------------------------------------------------------------------------- 

శ్రీకాకుళం 1904         1104 192 608

ఆమదాలవలస 528         288 144 96

రాజాం         336         96 48 192

పలాస         912         336 480 96

ఇచ్ఛాపురం 192         144 ----- 48

....................................................................

మొత్తం         3872         1968  864 1040

-------------------------------------------------- 

Updated Date - 2020-12-08T04:48:32+05:30 IST