ఐసీఏఆర్‌ గుర్తింపు కోసం

ABN , First Publish Date - 2020-03-18T10:36:25+05:30 IST

ఐసీఏఆర్‌ (ఇండి యన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌, న్యూఢిల్లీ) గుర్తింపు కోసం ఎస్‌ఎస్‌ఆర్‌పురం లోని

ఐసీఏఆర్‌ గుర్తింపు కోసం

విద్యార్థుల పోరాటం

మూడు రోజులుగా ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆందోళన

పీజీ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన


ఎచ్చెర్ల, మార్చి 17: ఐసీఏఆర్‌ (ఇండి యన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌, న్యూఢిల్లీ) గుర్తింపు కోసం ఎస్‌ఎస్‌ఆర్‌పురం లోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ క ళాశాల విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.  తమ కళాశాలకు ఐసీఏఆర్‌  గుర్తింపు  కల్పిం చాలంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వి ద్యార్థులు మాట్లాడుతూ, మరో రెండు, మూడు నెలల్లో బీఎస్సీ వ్యవసాయ కోర్సు పూర్తికానుం దని, కానీ, ఇంతవరకు కళాశాలకు ఐసీఏఆర్‌ గుర్తింపు రాలేదన్నారు.


దీనివల్ల జాతీయ స్థాయిలో జూనియర్‌ రీసెర్చ్‌ పీజీ అడ్మిషన్లలో సీట్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికే పలుమార్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఈ విషయా న్ని తెలియజేశామన్నారు. ఇప్పటికైనా ఐసీఏఆర్‌ గుర్తింపు కల్పించాలని కోరారు. కళాశాల యా జమాన్య ప్రతినిధి బుడుమూరు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, తొలి బ్యాచ్‌ విద్యార్థులు రిలీవ్‌ అయితే తప్ప ఐసీఏఆర్‌ గుర్తింపు పొందేందుకు అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఎన్జీరంగా యూ నివర్సిటీ తరఫున ఉపకులపతి.. అనుబంధ కళాశాల విద్యార్థులకు కూడా జేఆర్‌ఎఫ్‌ సీట్లకు అర్హత కల్పించాలని కోరుతూ సంబంధిత అధి కారులకు లేఖ రాసినట్లు శ్రీరామ్మూర్తి తెలిపారు. 


2016-17లో ఏర్పాటు

రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాల యం (గుంటూరు) అనుబంధంగా ఆరు ప్రై వేటు కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసా య కళాశాలను ఎచ్చెర్ల (ఎస్‌ఎస్‌ఆర్‌పురం)లో ప్రారంభించారు. ఈ కళాశాలల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది మే నెలలో రిలీవ్‌ కావల్సి ఉంది. తొలి బ్యాచ్‌ రిలీవ్‌ అవుతున్నా, ఇప్పటికీ ఐసీఏఆర్‌ గుర్తింపు లేక పోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతు న్నారు.  ఈ గుర్తింపు లేకపోతే రాష్ట్రస్థాయిలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయి నా, జాతీయ స్థాయిలో నిర్వహించే జేఆర్‌ఎఫ్‌ (జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) పీజీ సీట్లు పొందేందుకు అవకాశం లేదు. కేవలం ఐసీఏఆర్‌ గుర్తింపు ఉన్న కళాశాలల్లో వ్యవసాయ బీఎస్సీ పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే జేఆర్‌ఎఫ్‌ పీజీ సీట్లు పొందేందుకు అర్హత ఉంటుంది. 


తొలి బ్యాచ్‌  రిలీవయ్యాకే..

  వ్యవసాయ విద్య నిబంధనల ప్రకారం ఏ కళాశాలకైనా జాతీయ స్థాయిలో ఐసీఏఆర్‌ గుర్తింపునకు ఒక బ్యాచ్‌ విద్యార్థులు రిలీవ్‌ కావల్సిఉంది. 2016-17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రారంభమైన 6 ప్రైవేటు కళాశాల లకు ఇదే నిబంధన వర్తిస్తుంది. తొలి బ్యాచ్‌ విద్యార్థులు రిలీవ్‌ అయిన తర్వాత ఐసీఏఆర్‌ బృందం కళాశాలను సందర్శించి, నిబంధనల మేరకు కళాశాల నిర్వహణ, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి గుర్తింపు మంజూరు చేస్తుంది. 

- డాక్టర్‌  రమణ, అసోసియేట్‌ డీన్‌, నైర వ్యవసాయ కళాశాల / మెంటార్‌, ఎర్రన్నాయు డు వ్యవసాయ కళాశాల

Updated Date - 2020-03-18T10:36:25+05:30 IST