బైక్ షోరూంలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-07-11T11:32:43+05:30 IST
పట్టణ మెయిన్ రోడ్డులోని ఓ బైక్ షోరూంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.
12 వాహనాలు దగ్ధం
రూ.5లక్షల నష్టం
సోంపేట రూరల్: పట్టణ మెయిన్ రోడ్డులోని ఓ బైక్ షోరూంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 కొత్త బ్యాటరీ(ఎలక్ట్రికల్) వాహనాలు, 8 పాత వాహనాలు దగ్ధమైనట్లు సోంపేట అగ్నిమాపక అధికారి ఎస్.వరహాలు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పక్క మేడమీద ఉన్న మహిళలను అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో కిందకు దించారు.