అల్పపీడనంతో రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2020-04-26T10:19:16+05:30 IST
అల్పపీడనం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న పొలాల్లో ఉండిపోవడంతో వారు ..

ఎచ్చెర్ల, ఏప్రిల్ 25: అల్పపీడనం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న పొలాల్లో ఉండిపోవడంతో వారు కలవర పడుతున్నారు. ఈ ఏడాది మండలంలో కొత్తపేట, ముద్దాడ, రుప్పపేట, కొంగరాం, చినకొంగరాం తదితర గ్రామాల్లో మొక్కజొన్న విస్తారంగా సాగుచేశారు. కొన్ని చోట్ల ఇప్పటికే పంట చేతికందింది. రైతులు గింజలను ఒలిచి కళ్లాలు, పొలాల్లో ఆరబెడుతున్నారు.
అయితే, అల్పపీడనం ప్రభావంతో శనివారం చిన్నపాటి జల్లులు కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మొక్కజొన్న గింజలు తడిసిపోకుండా పరదాలను కప్పారు. భారీ వర్షం కురిస్తే చేతికందిన పంట నాశనమవుతుందేమోనని భయపడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఫౌలీ్ట్ర వ్యాపారులు క్వింటా మొక్కజొన్నను రూ.1350 నుంచి రూ.1470లకు కొనుగోలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వమే మొక్కజొన్నను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.