పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-13T10:27:05+05:30 IST

పరిహారం చెల్లించాలంటూ జేఆర్‌పురం, గరికిపాలెం రైతులు రామతీర్థం జంక్షన్‌ వద్ద శనివారం ఆందోళన చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా దన్ననపేట మీదుగా వయా రాయివలస మీదుగా నిర్మించే బైపాస్‌ కోసం అధికారులు రైతుల నుంచి భూములు

పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన

రణస్థలం: పరిహారం చెల్లించాలంటూ జేఆర్‌పురం, గరికిపాలెం రైతులు రామతీర్థం జంక్షన్‌ వద్ద శనివారం ఆందోళన చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా దన్ననపేట మీదుగా వయా రాయివలస మీదుగా నిర్మించే బైపాస్‌ కోసం అధికారులు రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే, నాలుగేళ్లు అవుతున్నా పరిహారం చెల్లించకపోవడంతో రైతులు పోరాటానికి దిగారు. శనివారం రామతీర్థం జంక్షన్‌ వద్ద రైతులు ఆందోళన చేశారు. వెంటనే పరిహారం చెల్లించాలని, లేదా భూములైనా వదిలేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-13T10:27:05+05:30 IST