ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ABN , First Publish Date - 2020-09-06T10:35:53+05:30 IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రైతు సంఘం, సీఐటీయూ పిలుపునిచ్చింది.

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

  • రైతు సంఘాలు, సీఐటీయూ పిలుపు
  • ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించవద్దు 
  • జిల్లా వ్యాప్తంగా నిరసనలు

సోంపేట రూరల్‌, సెప్టెంబరు 5: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రైతు సంఘం, సీఐటీయూ పిలుపునిచ్చింది.  శనివారం పాలవలసలో రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో  రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంగారు లక్ష్మీనారాయణ, దున్న హేమయ్య, పి.కృష్ణారావు  పాల్గొన్నారు. పొందూరు: కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంబి స్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ అప్పలనాయు డు ఆరోపించారు. శనివారం పొందూరు ఏఎంసీకార్యాలయం సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.కార్యక్రమంలో సీఐటీయూ  మం డల కన్వీనర్‌ కె.గోవిందరావు పాల్గొన్నారు. పాలకొండ రూరల్‌: పాలకొండలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పలు సంఘాల ఆధ్వర్యంలో  నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ  అందరికి కరోనా పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలన్నారు.  కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, లక్ష్మణ, పట్టాభి, శ్రీను పాల్గొన్నారు. భామిని: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ నిలిపివేయాలని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్‌  కోరారు. 


శనివారం భామినిలో  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.  కార్యక్రమంలో ఎం.అప్పలస్వామి, శంకర్‌, రామారావు, జగన్నాయకులు   పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విరమించు కోవాలని సీఐటీయూ  నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం  వజ్రపుకొత్తూరు తహసీల్దార్‌  కార్యాలయం ఎదుట  నిరసన తెలిపి అనంతం సిబ్బందికి వినతిపత్రం అందించారు.  కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, మోహనరావు పాల్గొన్నారు.  


రాజాంరూరల్‌/పోలాకి/సారవకోట: కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం రాజాం, పోలాకి, సారవకోటలలో ఐక్యకార్యాచరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు సిహెచ్‌.రామ్మూర్తినాయుడు,  కాళ్ల నరసింహ,  తంప అప్పయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయులు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం కార్మికులపై వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభు త్వరంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అనిల్‌, బాలరాజు, లక్ష్మిభారతి, గన్నయ్య, అంకమ్మ, దేవాది సు గుణమ్మ, శ్రీను, అప్పారావు, ఢిల్లీ, నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.


 దేశభక్తి పేరుతో ప్రజల మధ్య చిచ్చు

గుజరాతీపేట: దేశభక్తి పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధిపొందుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగారపు ఈశ్వరమ్మ విమర్శించారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు స్థానిక ఎంఐజీ కాలనీలోని  సంఘం కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, ప్రజాధనంతో నిర్మించుకున్న రైల్వే, టెలీకాం, విమానాశ్రయాలు, భారీ పరిశ్రమలు వంటి వాటిని కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతుందని విమర్శిం చారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాలని, ఒక్కోకుటుంబానికి రూ.7,500చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో చంద్రిక పాల్గొన్నారు.


పోరాటం ఉధృతం చేస్తాం

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేదంటే పో రాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ పాలనలో కరోనాకు ముందే దేశ ఆర్థిక వవస్త విచ్చిన్నమైందన్నారు. ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఐద్వా నాయకులు ఎన్‌వీ  రమణ, ఎ.లక్ష్మి, కె.పుణ్యవతి పాల్గొన్నారు.


ఎన్‌ఈపీని ఏకపక్షంగా ప్రకటించడం సరికాదు

నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ-2020)  కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించడం సరికాదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహా అధ్యక్షుడు సన్న శెట్టి రాజశేఖర్‌ అన్నారు. ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో ఉపాధ్యా యులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏ ఒక్కరి అభిప్రాయాలు, సూచనలు తీసుకోకుండా ఎన్‌ఈపీని రూపొందించారని,  ఈ విధానంతో  కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని విమర్శించారు. 

Updated Date - 2020-09-06T10:35:53+05:30 IST