26 వరకు డిగ్రీ ప్రవేశాలకు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-11-22T05:02:53+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 26వ తేదీ వరకూ గడువు పెంచినట్లు కాశీబుగ్గ ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.ఓబులేసు, అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎన్‌.శ్రీనివాస్‌ పట్నాయక్‌ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు.

26 వరకు డిగ్రీ ప్రవేశాలకు  గడువు పెంపు

కాశీబుగ్గ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 26వ తేదీ వరకూ గడువు పెంచినట్లు కాశీబుగ్గ ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.ఓబులేసు, అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎన్‌.శ్రీనివాస్‌ పట్నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు 2016 నుంచి 2020లోవర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌లో ఉత్తీర్ణత పొం దిన వారు  కూడా అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, అధ్యయన కేంద్రానికి తమ సర్టిఫికెట్లతో సంప్రదించాలని కోరారు.

 

Read more