సరిహద్దు భూముల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-18T04:35:10+05:30 IST

ఏఎస్‌ కవిటి పంచాయతీ పరిధిలోని భూభాగంలో ఆంధ్రా-ఒడిశా అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

సరిహద్దు భూముల పరిశీలన


పాతపట్నం:  ఏఎస్‌ కవిటి పంచాయతీ పరిధిలోని భూభాగంలో ఆంధ్రా-ఒడిశా అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పాల కొండ ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ నేతృత్వంలో తహసీల్దార్‌తో పాటు  అధి కారులు, అలాగే ఒడిశాకు చెందిన గజపతి జిల్లా అడిసనల్‌ అడిషినల్‌ కలెక్టర్‌ తోపాటు  అధికారులు రికార్డులతో క్షేత్రస్థాయిలో భూమి సరిహద్దులను పరిశీలించారు. ఇవి దీర్ఘకాలం ఆంధ్రాలో ఉండడంతో  ఆంధ్రా భూములుగా నిర్ధారి స్తూ ఉండే భూరికార్డులను చూపడంతో ఒడిశా అధికారులు వెనుదిరిగారు. 


 

Updated Date - 2020-12-18T04:35:10+05:30 IST