మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథంనాయుడు మృతి
ABN , First Publish Date - 2020-12-14T05:33:05+05:30 IST
టెక్కలి, డిసెంబరు 13: సీనియర్ నాయకుడు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాఽథంనాయుడు (90) ఆదివారం రాత్రి మృతిచెందారు. ఈయన 1972
టెక్కలి, డిసెంబరు 13: సీనియర్ నాయకుడు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాఽథంనాయుడు (90) ఆదివారం రాత్రి మృతిచెందారు. ఈయన 1972 నుంచి 78 వరకూ టెక్కలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టెక్కలి మేజర్ పంచాయతీలోని గోపినాథపురానికి చెందిన ఈయన వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. సమితి ప్రెసిడెంట్‌గా, పీఏసీఎస్ అధ్యక్షుడిగా కూడా పదవులు చేపట్టారు. టెక్కలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల ఏర్పాటు, ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం, విశాఖ డెయిరీ కేంద్రం ఏర్పాటు వంటి వాటి విషయంలో కృషిచేశారు. పీవీ నర్శింహరావు హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కలిసి పీవీ ప్రోగ్రసివ్ ఫోరం ఏర్పాటుచేశారు. అప్పట్లో అది రాజకీయ కలకలం రేపింది. అప్పట్లో జడ్పీ సమావేశ మందిరంలో లోకనాఽథంనాయుడు నాటి సీఎం ఎన్టీఆర్‌ను ప్రజా సమ స్యలపై ప్రశ్నించారు. లోకనాఽథంనాయుడు భార్య అన్న పూర్ణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకనాఽథంనా యుడు కుమారుడు వెంకటరమణతో మాట్లాడారు. కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రామ్మోహనరావు, మాజీ ఎంపీపీ చింతాడ మంజు, గణపతి, సత్తారు సత్యం తదితరులు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.