మూడు రోజుల వ్యవధిలో.. దంపతుల విషాదాంతం

ABN , First Publish Date - 2020-09-06T18:25:04+05:30 IST

కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిగా వారి దాంపత్యం సవ్యంగా..

మూడు రోజుల వ్యవధిలో.. దంపతుల విషాదాంతం

2న భార్య అనుమానాస్పద మృతి

5న భర్త బలవన్మరణం

పెయ్యలవానిపేటలో విషాదం

 

(ఎచ్చెర్ల/శ్రీకాకుళం): కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిగా వారి దాంపత్యం సవ్యంగా సాగింది. మూడు రోజుల కిందట యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. అత్తింటి వేధింపులతోనే నన్న మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే భర్త శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల వ్యవధిలో దంపతుల విషాదాంతం పెయ్యలవానిపేటలో చోటుచేసుకుం ది. ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి. 


తోటపాలెం పంచాయతీ పెయ్యలవానిపేటలో బగాది శిరీష (21) అనే వివాహిత ఈ నెల 2న అనుమానాస్పదంగా మృతిచెందింది. ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన శిరీష శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసేది. పెయ్యలవానిపేటకు చెందిన బోనెల హేమసుం దర్‌ (22) అక్కడే పనిచేసేవాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. శిరీష తల్లి రాజేశ్వరి అంగీకరించకపోవడంతో ఏడాది కిందట ప్రేమ వివాహం చేసు కున్నారు. పెయ్యలవానిపేటలోనే ఉంటున్నారు. ఈ నెల 2న శిరీష అను మానాస్పద స్థితిలో మృతిచెందింది. అత్తింటి వారు ఆత్మహత్యకు పాల్పడి నట్టు చెబుతుండగా... హత్యగా అనుమానిస్తూ మృతురాలి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ నేపథ్యం లో శనివారం ఉదయం హేమసుందర్‌ ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.  శని వారం వేకువజామున 3 గంటల సమయంలో తండ్రి రఘు లేపడంతో హేమసుందర్‌ బాత్‌రూమ్‌కు వెళ్లి తిరిగి నిద్రకు ఉపక్రమించాడు. ఆ తర్వాత హేమసుందర్‌ చేతికి ఇంజక్షన్‌ వేసుకొని చనిపోయినట్టు మృతు డి తండ్రి రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంజక్షను ఇచ్చుకున్నట్టు సిరంజీ కూడా ఉందని... శనివారం ఉదయం 6 గంటల సమయంలో నిద్ర నుంచి లేపేందుకు ప్రయత్నించగా విగతజీవిగా పడిఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య చనిపోయిందన్న మనస్తాపంతో చనిపో యాడా? భార్య అనుమానస్పద మృతిపై పోలీసు కేసు నమోదైందన్న భయంతో చనిపోయాడా అన్న విషయం తెలియరాలేదు. ఎస్‌ఐ జి.రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-09-06T18:25:04+05:30 IST