నిత్యావసర సరుకులు సక్రమంగా అందించాలి

ABN , First Publish Date - 2020-03-28T06:54:34+05:30 IST

కరోనా ప్రభావం కారణంగా ప్రజలు నిత్యవసరాలకు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశిం చారు.

నిత్యావసర సరుకులు సక్రమంగా అందించాలి

విజయనగరం ఎంపీ బెల్లాన 


రాజాం రూరల్‌, మార్చి 27: కరోనా ప్రభావం కారణంగా ప్రజలు నిత్యవసరాలకు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశిం చారు. ఎమ్మెల్యే కంబాల జోగులు క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో శుక్రవారం నిర్వ హించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ గ్రామంలోనైనా కరోనా లక్షణాలు ఉన్న కేసులు ఉంటే తగిన చర్యలు చేపట్టాలన్నారు.


కూరగాయలు ధరలకు విక్రయించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, పట్టణ కన్వీనరు పాలవలస శ్రీనివాసరావు, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, తహసీల్దార్‌ పి.వేణుగోపాలరావు, ఎంపీడీవో బాసూరు శంకరావు, సీఐ జి.సోమశేఖర్‌, సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.చంద్రశేఖర్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-28T06:54:34+05:30 IST