-
-
Home » Andhra Pradesh » Srikakulam » Errors in grain purchase
-
ధాన్యం కొనుగోలులో లోపాలు
ABN , First Publish Date - 2020-12-30T06:01:56+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో లోపాలు రైతులకు శాపంగా మారుతున్నాయని పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు పోరాటంలో భాగంగా కొర్లకోటలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో అధికారులు చెబుతున్న మాటలకు..వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు.

టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్
ఆమదాలవలస రూరల్, డిసెంబరు 29: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో లోపాలు రైతులకు శాపంగా మారుతున్నాయని పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు పోరాటంలో భాగంగా కొర్లకోటలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో అధికారులు చెబుతున్న మాటలకు..వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల విషయంలో చాలా సమస్యలు ఉన్నా..అధిగమించే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. రవాణా చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తామనడం వైసీపీ మోసపూరిత విధానాలను తెలియజేస్తోందన్నారు. నారాయణపురం హైలెవెల్ ద్వారా సాగునీరు అందకపోవడం ఇదే తొలిసారి అని విమర్శించారు. కొర్లకోట గ్రామంలో పేదల ఇళ్లను తొలగించి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామంటే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సనపల ఢిల్లేశ్వరరావు, నూక రాజు, గొండు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.