-
-
Home » Andhra Pradesh » Srikakulam » Equality with human rights
-
మానవ హక్కులతోనే సమానత్వం
ABN , First Publish Date - 2020-12-11T04:59:41+05:30 IST
ప్రపంచ మాన వాళికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవ హక్కు లతో స్వేచ్ఛ, సమానత్వాలు సిద్ధిస్తాయని ప్రభుత్వ డి గ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఆర్ జ్యోతి ఫెడ్రరిక్ అన్నా రు. గురువారం ప్రపంచ మానవ హక్కుల దినోత్స వాన్ని కళాశాలలో నిర్వహించారు.

నరసన్నపేట, డిసెంబరు 10: ప్రపంచ మాన వాళికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవ హక్కు లతో స్వేచ్ఛ, సమానత్వాలు సిద్ధిస్తాయని ప్రభుత్వ డి గ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఆర్ జ్యోతి ఫెడ్రరిక్ అన్నా రు. గురువారం ప్రపంచ మానవ హక్కుల దినోత్స వాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ హక్కులను ఐక్యరాజ్య సమితి ముందుచూపుతో 1948 లోనే రూపొందించిందన్నారు. కార్యక్రమంలో ఆమదాలవలస డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు కేశవరావు మానవ హక్కుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు.
హక్కులను కాపాడుకోవాలి
రాజాం: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని న్యాయ వాది రెడ్డి విజయ్‌కుమార్ అన్నారు. సెంటేన్స్ స్త్రీశక్తి సంఘం ఆధ్వర్యంలో గురువారం మానహక్కుల దినో త్సవాన్ని నిర్వహించారు. గృహ కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించడంతో పాటు వారికి గుర్తింపు కార్డు లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సెంటేన్స్ ఆసు పత్రి ప్రతినిధి మేరి విజయ, డైరెక్టర్ హిల్డా, రేవతి తదితరులు పాల్గొన్నారు.
అవగాహన అవసరం
కె.కొత్తూరు(టెక్కలి): మానవహక్కులు, పౌరుల విధులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగివుం డాలని మానవ హక్కుల కమిషన్ ఆఫ్ ఇండియా జిల్లాశాఖ అధ్యక్షుడు ఎన్.వెంకటేష్ అన్నారు. గురువారం జాతీయ మానవహక్కుల దినోత్సవంలో భాగంగా ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మానవ హక్కుల్లో కొన్ని రాజ్యాంగం ప్రకా రం, మరికొన్ని చట్టాలతో సంక్రమించాయని, అయితే వీటికి భంగం కలిగినప్పుడు ప్రశ్నించకుంటే నష్టపోతారన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బెండి నర్సింగరావు, అన్నెపు జగదీష్, అట్టాడ శ్రీధర్ పాల్గొ న్నారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హ క్కుల దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.గోవిందమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది ధవళ రాజేశ్వరరావు భారత దేశం-హక్కుల పరిరక్షణ అంశంపై వివరించారు. కార్యక్రమంలో త్రినాథరావు, డాక్టర్ ధర్మారావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.