ఆకలితో అలమటిస్తున్నాం
ABN , First Publish Date - 2020-05-24T08:41:54+05:30 IST
‘స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బతకడానికి వచ్చాం. 50 రోజుల పాటు లాక్‌డౌన్‌లో చిక్కుకొని ఆపసోపాలు పడ్డాం.

మెళియాపుట్టి: ‘స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బతకడానికి వచ్చాం. 50 రోజుల పాటు లాక్‌డౌన్‌లో చిక్కుకొని ఆపసోపాలు పడ్డాం. ఎలాగోలా కాలినడకనైనా స్వగ్రామాలకు చేరుకుంటామంటే తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. వారం రోజులవుతున్నా.. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆకలితో అలమ టిస్తున్నాం. మమ్మల్ని తరలించే ఏర్పాటుచేయండి’...అంటూ జిల్లాలోని మెళి యాపుట్టి ప్రాంతానికి చెందిన 150 మంది వలస కూలీలు వేడుకుంటున్నారు.
కొన్ని నెలల కిందట వీరంతా భవన నిర్మాణ పనుల కోసం చెన్నై వెళ్లారు. లాక్‌డౌన్‌లో చిక్కుకోవడంతో అక్కడి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటీవల లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో పదిరోజుల కిందట కాలినడకన బయలుదేరారు. ఆంధ్రా సరిహద్దు సమీపంలోకి వచ్చేసరికి తమిళనాయుడు పోలీసులు అడ్డుకొని మరోసారి పునరావాస కేంద్రానికి తరలించారు. కానీ అక్కడ సదుపాయాలు లేకపోవడంతో ఆకలితో అలమ టిస్తున్నామని చెబుతున్నారు. స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు.