అర్హులు నష్టపోకూడదు
ABN , First Publish Date - 2020-12-31T05:19:35+05:30 IST
ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందించాలని, అర్హులెవరూ నష్టపోకుండా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు.

వెల్ఫేర్ అసిస్టెంట్ల శిక్షణ తరగతుల్లో జేసీ శ్రీనివాసులు
కలెక్టరేట్, డిసెంబరు 30: ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందించాలని, అర్హులెవరూ నష్టపోకుండా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడారు. ‘సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అసలైన లబ్ధిదారులను గుర్తిం చి వారికి పథకాలు చేర్చాలి. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు కల్పించ వద్దు. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది నిజాయితీగా పనిచేయాలి. పథకాలకు సంబంధించి డైరీని అందుబాటులో ఉంచుకోవాలి. అందులో లబ్ధిదారుల జాబితా, అనర్హుల వివరాలు ఉండాలి. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దు. సకాలంలో విధులకు హాజరై బయోమెట్రిక్ వేయాలి. టెక్నాల జీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి.’ అని జేసీ సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ, జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, చేనేత, జౌళిశాఖ ఏడీ పద్మ, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పథకాలు చేరువకావాలి
సీతంపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరువ కావాలని జేసీ కె.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సీతంపేటలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో పాలకొండ డివిజన్‌స్థాయి సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖ అధికారులతో సమీక్షించారు. సచివాలయం ద్వారా అందుతున్న పథకాల గురించి ప్రతి లబ్ధిదారుడికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.ఫపాలకొండ:సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జేసీ కె.శ్రీనివాసులు హెచ్చరించారు. పాలవలస సచివాలయాన్ని తనిఖీచేశారు.