-
-
Home » Andhra Pradesh » Srikakulam » Elephants in the gardens disturbance among the farmers
-
తోటల్లో ఏనుగులు... రైతుల్లో కలవరం
ABN , First Publish Date - 2020-12-29T05:01:52+05:30 IST
మండలంలోని కేశుపురం, బూర్జపాడు పంచాయతీల్లో ఏనుగుల బీభత్సం కోనసాగుతోంది. ఆదివారం వరి కుప్పలు ధ్వంసం చేసిన విషయం విదితమే. సోమవారం కేశుపురం, సన్యాసిపుట్టుగలోని జీడి తోటలు నాశనం చేయడంతో రైతులు కలవరపుతున్నారు.

కొనసాగుతున్న బీభత్సం
అటవీ అధికారుల ముమ్మరంగా గాలింపు
ఇచ్ఛాపురం రూరల్ : మండలంలోని కేశుపురం, బూర్జపాడు పంచాయతీల్లో ఏనుగుల బీభత్సం కోనసాగుతోంది. ఆదివారం వరి కుప్పలు ధ్వంసం చేసిన విషయం విదితమే. సోమవారం కేశుపురం, సన్యాసిపుట్టుగలోని జీడి తోటలు నాశనం చేయడంతో రైతులు కలవరపుతున్నారు. పెద్ద లక్ష్మీపురంలోని జీడి, సరుగుడు తోటల్లో ప్రవేశించాయి. ఏనుగులకోసం అటవీ శాఖాధికారులు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి పి.అమ్మన్నాయుడు ఆధ్వర్యంలో సోమవారం కేశుపురం, సన్యాసిపుట్టుగ, బూర్జపాడు, చిన్నలక్ష్మీపురం, పెద్ద లక్ష్మీపురంలోని జీడు, సరుగుడు తోటల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడక్కడ ఏనుగులు తిరిగిన జాడలు కనిపిస్తున్నాయి.అవి ఎటువైపు వెళ్లాయో స్పష్టంగా తెలియడం లేదని చెబుతున్నారు. గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా ఎవరూ తోటల్లోకి వెళ్లవద్దని, రాత్రి సమయంలో గ్రామాల్లో మండలు ఏర్పాటుచేయాలని సూచిస్తున్నారు. రాత్రి సమయంలోనే అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించే అవ కాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అఽధికారులు హెచ్చరించారు. రెండురోజులుగా ఏనుగులు పంటలు నాశనం చేస్తున్నా, ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పూత దశలో ఉన్న జీడి తోటలు నాశనం అవుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు పంట నష్టాలను గుర్తించాలని రైతులు కోరుతున్నారు.