సున్నా వడ్డీతో మహిళలకు ఆర్థిక ప్రయోజం
ABN , First Publish Date - 2020-04-25T10:52:06+05:30 IST
సున్నా వడ్డీ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రయోజం చేకూరుతుం దని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం విజయవాడలో సున్నా

కలెక్టరేట్: సున్నా వడ్డీ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రయోజం చేకూరుతుం దని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం విజయవాడలో సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 8.78 లక్షల సంఘాల్లో ఉన్న 91లక్షల మంది సభ్యులకు రూ. 1400కోట్లు సున్నా వడ్డీ పథకం ద్వారా అందించటం జరిగిందన్నారు. మహిళలకు ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్ పాల్గొన్నారు.