సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

ABN , First Publish Date - 2020-04-07T11:20:15+05:30 IST

కరోనా సహాయక చర్యలకు సోమవారం కళింగసీమ సేవా సమితి జిల్లా నాయకులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించారు.

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 6:   కరోనా సహాయక చర్యలకు సోమవారం కళింగసీమ సేవా సమితి జిల్లా నాయకులు  సీఎం  సహాయ నిధికి విరాళాలు అందించారు. సంఘ నాయకుడు గురుగుబెల్లి బాలకృష్ణ్ణ రూ.లక్ష చెక్కును కలెక్టర్‌ నివాస్‌కు  సోమవారం అందజేశారు. అలాగే.. సంఘ అధ్యక్షుడు హనుమంతు కృష్ణారావు, కార్యదర్శి దుప్పల వెంకటరావు, ప్రధాన కార్యదర్శ చింతాడ మామ్మోహనరావు, కోశాధికారి కె.రవి తదితరులు కలెక్టర్‌ నివాస్‌కు రూ. 25 వేలు చెక్కును అందించారు.


ఫపరాంకుశ కాలనీకి చెందిన పలు సేవాసంస్థలు రూ. 40 వేలు విరాళం అందజేశారు. కలెక్టర్‌  నివాస్‌  పిలుపు మేరకు  చెక్కును డీఆర్‌వో దయానిధికి సోమవారం అందించారు.  చెక్కును అందించినవారిలో ఎ.ఎస్‌.ఆర్‌.మూర్తి, పి.రామారావు, ఎం.కె.ప్రసాద్‌, శేషాద్రి, జె.శ్రీధరరావు, జి.వాసుదేవరావు రమేష్‌ తదితరులు ఉన్నారు. 

Read more