-
-
Home » Andhra Pradesh » Srikakulam » Does the CM not remember Srikakulam district
-
సీఎంకు శ్రీకాకుళం జిల్లా గుర్తులేదా?
ABN , First Publish Date - 2020-12-30T06:03:04+05:30 IST
తుపాను పరిహారం మంజూరు విషయంలో జిల్లాను విస్మరించడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘అసలు సీఎం జగన్‌కు శ్రీకాకుళం జిల్లా గుర్తులేదా?’ అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో ఫోన్‌లో మాట్లాడారు. నివర్ తుపానుకు జిల్లాలో రైతులకు అపార నష్టం కలిగిందని గుర్తు చేశారు. కానీ మంగళవారం సీఎం జగన్ ప్రకటించిన పెట్టుబడి రాయితీలో జిల్లా పేరు లేకపోవడం శోచనీయమన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు పంటకు నష్టం కలిగితే రూ.30 వేలు పరిహారం అందించాలని చెప్పి..ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిచిందని గుర్తు చేశారు. 2014 నుంచి రైతుల ఖాతాలో ఏటా ఎంత పరిహారం జమ అయ్యిందో పరిశీలించుకొని మాట్లాడాలన్నారు. సంక్రాంతి సమీపిస్తున్నా ధాన్యం ఇంకా కల్లాల్లో మగ్గుతుండడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కంట కన్నీరు వస్తోందన్నారు. దీనిపై

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, డిసెంబరు 29: నివర్ తుపాను పరిహారం మంజూరు విషయంలో జిల్లాను విస్మరించడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘అసలు సీఎం జగన్‌కు శ్రీకాకుళం జిల్లా గుర్తులేదా?’ అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో ఫోన్‌లో మాట్లాడారు. నివర్ తుపానుకు జిల్లాలో రైతులకు అపార నష్టం కలిగిందని గుర్తు చేశారు. కానీ మంగళవారం సీఎం జగన్ ప్రకటించిన పెట్టుబడి రాయితీలో జిల్లా పేరు లేకపోవడం శోచనీయమన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు పంటకు నష్టం కలిగితే రూ.30 వేలు పరిహారం అందించాలని చెప్పి..ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిచిందని గుర్తు చేశారు. 2014 నుంచి రైతుల ఖాతాలో ఏటా ఎంత పరిహారం జమ అయ్యిందో పరిశీలించుకొని మాట్లాడాలన్నారు. సంక్రాంతి సమీపిస్తున్నా ధాన్యం ఇంకా కల్లాల్లో మగ్గుతుండడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కంట కన్నీరు వస్తోందన్నారు. దీనిపై సమీక్షించే తీరుబాటు ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం శోచనీయమని విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం జగన్, జిల్లా మంత్రులు స్పందించి... నివర్ తుపాను పరిహారం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.