ఉన్నది వద్దు.. ప్రైవేటే ముద్దు

ABN , First Publish Date - 2020-11-26T05:03:40+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో రోగులకు అత్య వసర పరిస్థితిలో ఆసుపత్రులకు తరలించేందుకు కొనుగోలు చేసిన అంబులెన్స్‌ నిరుపయోగంగా మా రింది.

ఉన్నది వద్దు.. ప్రైవేటే ముద్దు
సీతంపేటలో వృఽథాగా పడి ఉన్న అంబులెన్స్‌

 నిరుపయోగంగా ఎంపీ సమకూర్చిన అంబులెన్స్‌

 అద్దె చెల్లించి ప్రైవేట్‌ వాహనాలను వినియోగిస్తున్న వైనం

  ఏజెన్సీలో గిరిజనులకు తప్పనిపాట్లు

సీతంపేట:గిరిజన ప్రాంతాల్లో రోగులకు అత్య వసర పరిస్థితిలో ఆసుపత్రులకు తరలించేందుకు కొనుగోలు చేసిన అంబులెన్స్‌ నిరుపయోగంగా మా రింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నా యుడు అంబులెన్స్‌ను సమకూర్చారు. ఇదీ  సీతం పేట సామాజిక ఆసుపత్రికి చేరి నెలలు గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లకు అంబులెన్స్‌ లేక ప్రైవేటు అంబులెన్స్‌ సేవలను వినియోగిస్తున్నారు. వీటికి నెలకు రూ.35 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీతంపేటలో అంబులెన్స్‌ నిరుపయోగంగా ఉన్నా వినియోగించక పోవడంపై రోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో స్టేట్‌ బ్యాంక్‌ సహకారంతో చిన్న పిల్లల కోసం ప్రత్యేక అంబులెన్స్‌లు సమకూర్చినా ఆ  సేవలు కూడా ఇంతవరకు అందుబాటు లోకి రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోలు, ప్రైవేటు అంబులెన్స్‌లను ఆ శ్రయించాల్సి వస్తోందని, ఇప్పటికైనా తమ అవస్థలు తీర్చేందుకు అంబులెన్స్‌లు అందుబాటు లోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు. కాగా ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్‌కు రిజిస్ర్టేషన్‌ జాప్యం వల్ల అందుబాటులోకి రాలేదని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేష్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దీన్ని మందస పీహెచ్‌సీకి కేటాయి స్తామని చెప్పారు. ఐటీడీఏలో కొన్ని అంబులెన్స్‌ లను కుదించి, ప్రైవేటు అంబులెన్స్‌లకు అద్దె ప్రాతి పదికన తీసుకున్నట్లు తెలిపారు. వాటిని తొలగించి ఐటీడీఏ అంబులెన్స్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  

Read more