-
-
Home » Andhra Pradesh » Srikakulam » Do not want an arbitrary trend
-
ఏకపక్ష ధోరణి వద్దు
ABN , First Publish Date - 2020-11-22T05:20:59+05:30 IST
ఎస్‌ఐ కె.వాసునారాయణ ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారని, ఏకపక్ష ధోర ణితో వ్యవహరిస్తున్నారని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. ఇటీ వల కె.కొజ్జిరియలో ఇద్దరు యువకులు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణపడ్డారు.

కవిటి ఎస్‌ఐపై ఎమ్మెల్యే అశోక్ మండిపాటు
కవిటి: ఎస్‌ఐ కె.వాసునారాయణ ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారని, ఏకపక్ష ధోర ణితో వ్యవహరిస్తున్నారని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. ఇటీ వల కె.కొజ్జిరియలో ఇద్దరు యువకులు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణపడ్డారు. దీంతో ఈ విషయంపై ఓ వర్గం వారు ఫిర్యాదుచేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఎమ్మెల్యే అశోక్‌ను సంప్రందించారు. దీంతో ఎమ్మెల్యే శనివారం కవిటి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐను నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని కొత్తగా అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల మాటలు విని ఉద్యోగాలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మహిళలను ఇంట్లో పెట్టి కొట్టే దుస్థితికి దిగజారిపోయారని ఎమ్మెల్యే విమర్శించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆడవారిని కవిటి పోలీస్ స్టేషన్‌వద్ద రాత్రి 10 గంటల వరకు ఉంచి,మరునాడు ఉదయం రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎస్‌ఐను ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఇటువంటి సం ఘటనలు పునారావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.
అందరికీ సమన్యాయం
ఏకపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం తన కు లేదని, అందరికీ సమన్యాయం చేయడమే తమ విధుల్లో భాగమని ఎస్‌ఐ కె.వాసునారాయణ ఆంధ్రజ్యోతికి తెలి పారు. తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు.ఏకపక్షంగా ఒక్క కేసు నమోదు చేయలేదని తెలిపారు.ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.