ఎవరూ భయపడొద్దు

ABN , First Publish Date - 2020-03-23T09:27:31+05:30 IST

కరోనా వైరస్‌ పట్ల ఎవరూ భయపడనవ సరం లేదని లావేరు పీహెచ్‌సీ వైద్యాధికారి చంద్ర మౌళి ప్రజలకు సూచించారు.ఆదివారం

ఎవరూ భయపడొద్దు

లావేరు: కరోనా వైరస్‌ పట్ల ఎవరూ  భయపడనవ సరం లేదని  లావేరు పీహెచ్‌సీ వైద్యాధికారి చంద్ర మౌళి ప్రజలకు సూచించారు.ఆదివారం గురుగుబిల్లిలో కరోనాపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా  మా ట్లాడుతూ 14 రోజులపాటు ఇళ్లు కదల వద్దని  సూచిం చారు. లావేరులో వైద్య సిబ్బంది  మాక్‌ డ్రిల్‌   నిర్వ హించి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు.   కార్య క్రమంలో వైద్య సిబ్బంది రాజగోపాల్‌, శ్యామ సుందర్‌, సురేష్‌, పద్మావతి, వేదవల్లి పాల్గొన్నారు.


సంతకవిటి: కావలిలో వైద్యసిబ్బంది ఇంటింటా పరిశీలించి రక్తనమూనాలు సేకరించారు. దీంతో పాటు మండలంలో పలు గామాల్లో ఆశ, అంగన్‌వాడీ కార్య కర్తలు కరోనాపై అవగాహన కల్పించారు.


రాజాం:రాజాం నగరపంచాయతీ పరిధిలోగల ఆరో వార్డులోని సంకల్ప నేటి గాంధీ సొసైటీ ఆధ్వ ర్యంలో ఆదివారం అవగాహన కల్పించారు. సొసైటీ అధ్యక్షుడు పొట్నూరు ఈశ్వరరావు ఆధ్వర్యంలో  కరోనా నివారణకు పరిశుభ్రతే మార్గమని వివరించారు.  చేతులు ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-03-23T09:27:31+05:30 IST