పర్యావరణ హితంగా దీపావళి

ABN , First Publish Date - 2020-11-14T04:59:08+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షల నడుమ దీపావళి పండుగను జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. కాలుష్యం ప్రబలకుండా.. కేవలం పర్యావరణహిత టపాసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. అది కూడా కేవలం రెండు గంటలు మాత్రమే(రాత్రి 8 నుంచి 10 గంటల వరకు) టపాసులు పేల్చాలని షరతులు విధించింది. ఈ మేరకు పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవాలని.. దీనికి జిల్లా ప్రజలంతా సహకరించాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు.

పర్యావరణ హితంగా దీపావళి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌


రెండు గంటలే అనుమతి

 గ్రీన్‌ టపాసులనే వినియోగించాలి

 ప్రజలంతా సహకరించాలి 

 కలెక్టర్‌ నివాస్‌ 

(కలెక్టరేట్‌, నవంబరు 13) 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షల నడుమ దీపావళి పండుగను జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. కాలుష్యం ప్రబలకుండా.. కేవలం పర్యావరణహిత టపాసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. అది కూడా కేవలం రెండు గంటలు మాత్రమే(రాత్రి 8 నుంచి 10 గంటల వరకు) టపాసులు పేల్చాలని షరతులు విధించింది. ఈ మేరకు పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవాలని.. దీనికి జిల్లా ప్రజలంతా సహకరించాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. కరోనా బాధితుల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్యాన్ని వెదజల్లే మతాబులకు స్వస్తి పలికి.. దీప కాంతులతో దీపావళి చేసుకుందామన్నారు. మతాబులు కాల్చడం వల్ల గాలిలో కాలు ష్యం ఏర్పడి కరోనా బాధితుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే  ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీపాల వెలుగుల్లో కరోనా వైరస్‌ రక్కసి పూర్తిగా నశించి జిల్లాలో నూత న అధ్యాయం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. దీపావళి సామగ్రి విక్రయాల కోసం అనుమతిచ్చిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాన్ని ఆయన శుక్ర వారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ ఏడాది 20 దుకాణాలకు మాత్రమే అనుమతిచ్చాం. వీటిని లాటరీ విధా నంలో కేటాయించాం. దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండాలి. సామగ్రి కొనుగోలుకు వచ్చే వ్యక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలి. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పర్యావరణానికి హాని చేయని టపాసులనే వినియోగించాలి. ప్రజలు గ్రీన్‌ టపాసులనే కాల్చాలి. శనివారం రాత్రి  8 నుంచి 10 గంటల వరకు మాత్రమే దీపావళిని నిర్వహించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి’ అని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజ లు సురక్షిత చర్యలు చేపట్టాలన్నారు. శానిటైజర్లు రాసుకొని టపాసులు వెలిగించవద్దన్నారు. సబ్బుతో  చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఆర్డీవో కిషోర్‌ కుమార్‌, జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్‌ కృపారావు, సహాయ అగ్నిమాపకాధికారి బీజేడీఎస్‌ ప్రశాంత్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, పట్టణ కొవి డ్‌ అధికారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


 


Updated Date - 2020-11-14T04:59:08+05:30 IST