జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించాలి

ABN , First Publish Date - 2020-02-12T10:08:28+05:30 IST

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించాలని బీజేపీ జాతీయ

జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించాలి

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కంభంపాటి 


గుజరాతీపేట, ఫిబ్రవరి 11: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు  పేర్కొన్నారు. దీనదయాల్‌ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో సమర్పణా దివాస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై 2014లోనే ప్రతిపాదించి నట్లు చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను చేపట్టారన్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. 


రాష్ట్రంలో 26 జిల్లాలకు ప్రతిపాదనలు

నవ్యాంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలను  ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రతిపాదించిందని కంభంపా టి హరిబాబు తెలిపారు. అయితే, దీన్ని గత టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. వైసీపీ కూడా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను చేప డతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ  ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేద న్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతా లను తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించినట్లు చెప్పారు. ప్రభు త్వ పరంగా అమలుకాకపోయినప్పటికీ సంస్థాగ త ఎన్నికల ద్వారా పునర్‌వ్యవస్థీకరణకు మద్ద తుగా ప్రాధాన్యమిచ్చామన్నారు. 


దీనదయాల్‌ సిద్ధాంతాలకు అనుగుణంగానే..

దీనదయాల్‌ ఉపాధ్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగానే ప్రధాని నరేంద్రమోదీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కంభంపాటి తెలిపారు. 33 కోట్ల మంది పేదలకు బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, రూ.12కే జీవన సురక్ష ప్రేరణ ద్వారా రూ.2లక్షల బీమా చెల్లింపు, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఆయు ష్మాన్‌భవ కింద ఆరోగ్య రక్షణకు రూ.5 లక్షల ఖర్చు, వంటి పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. నియమ, నిబంధనల ప్రకారం సమర్పణా దివాస్‌ను చేపట్టామన్నారు.


పార్టీ నాయకులు, కార్యకర్తలు రూ.2వేలు, రూ.2వేల లోపు మొత్తాన్ని నగదు రూపంలో సమర్పణా దివాస్‌కు సమర్పించవచ్చునని తెలిపారు. రూ.2వేలు దాటితే చెక్‌ ఇవ్వాలన్నా నిబంధనను విధించినట్టు చెప్పారు. ఇన్‌కంటాక్స్‌ నిబంధనల ను ఆచరించేందుకు దీన్ని పార్టీ ప్రవేశపెట్టిందని  తెలిపారు. జిల్లాలో పైడి వేణుగోపాలం, కణితి విశ్వనాథం, పూడి తిరుపతిరావు, దుప్పల రవీంద్రబాబు, అట్టాడ రవిబాబ్జి, గొద్దు భాగ్యలక్ష్మి, రెడ్డి నారాయణరావు, కోటగిరి నారాయణరావు, తదితరులు పార్టీ బలోపేతానికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణు గోపాలం, జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జి, నాయకులు పూడి తిరుపతిరావు, కణితి విశ్వనా థం, దుప్పల రవీంద్రబాబు, రెడ్డి నారాయ ణరావు, గొద్దు భాగ్యలక్ష్మి, సంపతిరావు నాగేశ్వర రావు, చల్లా వెంకటేశ్వరరావు, ఎంబీజే నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T10:08:28+05:30 IST