‘ నూతన’ వేడుకలకు దూరం
ABN , First Publish Date - 2020-12-31T05:26:55+05:30 IST
కొవిడ్-19 నిబంధనల దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
టెక్కలి: కొవిడ్-19 నిబంధనల దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు అందుబాటులో ఉండడం లేదని, ఈ విషయాన్ని కార్యకర్తలు, నాయకులు, గమనించాలని కోరారు. 2021 నూత న సంవత్సరం సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఫకొత్తూరు: నూతన సంవత్సర వేడుకలకు దూరం గా ఉంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.