-
-
Home » Andhra Pradesh » Srikakulam » Disha Act for protection of women
-
మహిళల రక్షణకే ‘దిశ చట్టం’
ABN , First Publish Date - 2020-11-26T05:16:50+05:30 IST
మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులను అరికట్టేందుకే దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కాశీబుగ్గ ఇన్‌చార్జి డీఎస్పీ మూర్తి అన్నారు. స్థానిక ఓ కల్యాణ మండపంలో మహిళలకు బుధవారం దిశ యాప్‌పై అవగాహన కల్పించారు.

టెక్కలి : మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులను అరికట్టేందుకే దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కాశీబుగ్గ ఇన్‌చార్జి డీఎస్పీ మూర్తి అన్నారు. స్థానిక ఓ కల్యాణ మండపంలో మహిళలకు బుధవారం దిశ యాప్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ నీలయ్య, ఎస్‌ఐలు కామేశ్వరరావు, మహమ్మద్ యాసిన్, గోవిందరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఫ రాజాం రూరల్ : రాజాం సర్విల్ పరిధిలోని గ్రామ, వార్డు మహిళా పోలీసులకు విధులపై పాలకొండ డీఎస్సీ శ్రావణి అవగాహన కల్పించారు. బుధవారం స్థానిక ఓ కల్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళలపై హింసా నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ, హక్కులను వివరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ నవీన్‌కుమార్, రాజాం, సంతకవిటి, వంగర, జి.సిగడాం ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఫ మెళియాపుట్టి : దిశపై ప్రతి మహిళ తెలుసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శాంతిభవానీ తెలిపారు. బుధవారం టీకేఆర్‌పురం, మారుడుకోట అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దేవిపూర్ణిమ తదితరలు పాల్గొన్నారు.