‘ఎత్తిపోతల’పై చర్చ

ABN , First Publish Date - 2020-09-01T09:17:15+05:30 IST

మందస మండలంలో మహేంద్రతనయ నదిపై ఎత్తిపోతల పథకాల సాధ్యాసాధ్యాలపై మంత్రి సీదిరి అప్పలరాజు నీటిపారుదల అభివృద్ధి

‘ఎత్తిపోతల’పై చర్చ

పలాస, ఆగస్టు 31 : మందస మండలంలో మహేంద్రతనయ నదిపై ఎత్తిపోతల పథకాల సాధ్యాసాధ్యాలపై మంత్రి సీదిరి అప్పలరాజు నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఈఈ ఎం.లక్ష్మీనారాయణ, డీఈఈ సుబ్రహ్మణ్యంతో చర్చించారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయం కమిషనర్‌ ఛాంబర్‌లో అధికారులు మంత్రి అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.


పింపిడియా, పొత్తంగి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తే రైతులకు అదనంగా సాగునీరు అందించవచ్చని, దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రి కోరారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అనుమతులు తీసుకోవాలని, దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 

Updated Date - 2020-09-01T09:17:15+05:30 IST